‘రిటర్న్ గిఫ్ట్’తో ఏపీకి మంచి జరుగుతుంది.. చంద్రబాబు పని పడతాం!: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్
Advertisement
చంద్రబాబుకు తప్పకుండా ‘రిటర్న్ గిఫ్ట్’ ఇస్తామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఇంకా హాట్ గానే ఉన్నాయి. దీనిపై ఏపీ టీడీపీ నేతల విమర్శలు, టీఆర్ఎస్ నేతల ప్రతివిమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. చంద్రబాబుకు ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుందన్న ప్రశ్నకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందిస్తూ, తినబోతూ రుచులడగడం కరెక్టు కాదని, ఆ గిఫ్ట్ వల్ల ఏపీ రాష్ట్రానికి, ప్రజలకు కచ్చితంగా మంచి జరుగుతుందని అన్నారు. ఏపీకి, అక్కడి ప్రజలకు టీఆర్ఎస్ వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చంద్రబాబుకు, తమకు రాజకీయ వైరముందని, ఆయనకు తాము వ్యతిరేకమని, ఆయన పని కచ్చితంగా పడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Fri, Jan 18, 2019, 09:28 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View