బీజేపీ నేత ఈశ్వరప్ప వ్యాఖ్యలతో కర్ణాటకలో కలకలం.. అప్రమత్తమైన కాంగ్రెస్!
Advertisement
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధమని.. ఇటీవల బీజేపీ నేత ఈశ్వరప్ప ఢిల్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయమై కర్ణాటకలో కలకలం రేగడంతో రిసార్ట్ రాజకీయం ప్రారంభమైంది. బెంగుళూరులో నేడు జరిగిన కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశానికి ముగ్గురు మినహా 76 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఈ సమావేశానంతరం ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్ట్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు రూ.50-70 కోట్లు ఇవ్వజూపిందని.. మోదీకి అంతపెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ యత్నిస్తోందని... ఈ కుట్రలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా భాగస్వాములేనని సిద్దరామయ్య ధ్వజమెత్తారు.
Fri, Jan 18, 2019, 09:00 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View