ఒబామా దంపతుల పాత ఫొటోకు ‘లైక్స్’ వెల్లువ!
Advertisement
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భార్య మిచెల్ ఒబామాకు ‘హ్యాపీ బర్త్ డే’ చెబుతూ తన ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ ఖాతాల్లో ఓ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వాళ్లిద్దరూ యవ్వనంలో ఉన్నప్పటి ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో నవ్వుతున్న మిచెల్ భుజంపై చేయి వేసిన ఒబామా కూడా నవ్వులు చిందిస్తున్నారు. ఈ పోస్ట్ పై నెటిజన్లు అభినందనలు కురిపిస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘లైక్స్’ వర్షం కురిపించారు. ఇప్పటి వరకూ ఇన్ స్టా గ్రామ్’లో 4.7 మిలియన్లకు పైగా, ట్విట్టర్ లో 1.5 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి.

https://twitter.com/BarackObama/status/1085915185146150912
Fri, Jan 18, 2019, 08:05 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View