‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఎన్టీఆర్ పాత్ర పరిచయం.. ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ!
Advertisement
ఈరోజు సాయంత్రం 5 గంటలకు బదులుగా 6.57 గంటలకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ దివ్యముహూర్తం నిర్ణయించడం జరిగిందంటూ దర్శకుడు వర్మ తాజాగా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ పోస్ట్ ను విడుదల చేశారు. ఈ పోస్ట్ ద్వారా ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేశారు.

 కాగా, కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ, ఆవేదనతో నిండి ఉన్న ఎన్టీఆర్ పాత్ర కనిపించింది. ఈ పాత్రను ఎవరు పోషిస్తున్న విషయం ఈ వీడియో ద్వారా వెల్లడించ లేదు. వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ద్వారా మళ్లీ తిరిగి వచ్చారని, ప్రాణం పొసుకున్నారన్న అర్థం వచ్చేలా వర్మ తన పోస్ట్ లో వ్యాఖ్యానించారు.
 
Fri, Jan 18, 2019, 07:40 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View