‘సాహో’ స్పెషల్ సాంగ్ ప్రత్యేకతలివే...!
Advertisement
సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటి వరకూ ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల కోసమే భారీగా ఖర్చు చేసిన ఈ చిత్రబృందం తాజాగా ఓ ప్రత్యేక పాట కోసం కూడా భారీ ఖర్చుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఈ సాంగ్ కోసం లారెంట్ నికోలాస్, లారీ నికోలాస్ అనే అంతర్జాతీయ గుర్తింపు కలిగిన కవల డ్యాన్సర్లను సంప్రదించినట్టు సమాచారం. ఈ పాటకు జాతీయ అవార్డ్ గ్రహీత, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ తో డ్యాన్స్ కంపోజింగ్ చేయించడమే కాకుండా.. ఈ పాటలో వివిధ దేశాల డ్యాన్స్‌లను సైతం జోడించనున్నట్టు సమాచారం. ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Fri, Jan 18, 2019, 07:17 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View