వెయ్యి మంది డాన్సర్లతో 'సైరా' సాంగ్
Advertisement
మెగా అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'సైరా' సినిమాపైనే వుంది. తెలుగులో 'బాహుబలి' తరువాత ఆ స్థాయి ప్రాజెక్టుగా ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ చారిత్రక నేపథ్యం కలిగిన చిత్రంగా 'సైరా' ప్రత్యేకతను సంతరించుకుంది. చిరంజీవి కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచే సినిమా కావడంతో, నిర్మాతగా చరణ్ ఏ విషయంలోను రాజీ పడటంలేదు. అలాంటి ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా ఒక సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో ఒక కీలకమైన సన్నివేశం తరువాత ఒక పాట రానుందని చెబుతున్నారు. ఈ పాటను చిరంజీవి .. ముఖ్య పాత్రధారులతో పాటు వెయ్యిమంది డాన్సర్లు .. మరో వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులపై చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. కథను బట్టి ఇది స్వాతంత్ర్య ఉద్యమ కాంక్షను పెంచే పాట కావొచ్చు .. లేదంటే గూడెంలో జరిగే జాతర తరహా సాంగ్ లాంటిదైనా కావొచ్చు. ఈ పాట కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్ ను వేయిస్తున్నారట. అది పూర్తికాగానే చిత్రీకరణ మొదలవుతుందని అంటున్నారు.
Fri, Jan 18, 2019, 06:45 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View