అనిరుధ్ కి శంకర్ ఛాన్స్ ఇవ్వడానికి కారణం అదేనట!
Advertisement
శంకర్ దర్శకత్వంలో చాలా కాలం క్రితం వచ్చిన 'భారతీయుడు' సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయంలో సంగీతం చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. 'భారతీయుడు' సినిమాను మ్యూజికల్ హిట్ గాను నిలబెట్టింది. అంతటి విజయంలో కీలకమైన పాత్రను పోషించిన ఏఆర్ రెహ్మాన్ .. 'భారతీయుడు 2' ప్రాజెక్టులో లేకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా శంకర్ .. అనిరుధ్ ను తీసుకున్నాడు. '2.ఓ' సినిమా సమయంలో శంకర్ కి .. రెహ్మాన్ కి మధ్య మనస్పర్థలు తలెత్తడమే ఇందుకు కారణమనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. '2.ఓ' సినిమాకి రెహ్మాన్ చేసిన ట్యూన్స్ శంకర్ కి నచ్చలేదట. వేరే ట్యూన్స్ కావాలని అంటే ఆయన పెద్దగా స్పందించలేదట. అందువల్లనే కొన్ని పాటలు శంకర్ వాడలేదనే టాక్ కూడా వుంది. ఈ కారణమే శంకర్ సినిమాలో అనిరుధ్ కి ఛాన్స్ తగిలేలా చేసిందని చెప్పుకుంటున్నారు.
Fri, Jan 18, 2019, 06:26 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View