టీఆర్ఎస్ లో ఏ బాధ్యత అప్పజెప్పినా సమర్థవంతంగా నిర్వహిస్తా: వంటేరు ప్రతాప్ రెడ్డి
Advertisement
టీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాల ప్రకారం పని చేస్తానని, తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా సమర్థవంతంగా నిర్వహిస్తానని వంటేరు ప్రతాప్ రెడ్డిఅన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అనంతరం, వంటేరు మాట్లాడుతూ, గజ్వేల్ నియోజకవర్గానికి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించడం ప్రజల అదృష్టమని అన్నారు. ఈ నాలుగేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని అన్నారు.  
Fri, Jan 18, 2019, 05:57 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View