హీరోయిన్స్ కి అలా కథ చెబితే ఒప్పుకోరు: పరుచూరి గోపాలకృష్ణ
Advertisement
తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, హీరోయిన్స్ కి కథ ఎలా చెప్పి ఒప్పించాలి అనే విషయాన్ని గురించి మాట్లాడారు. "కథను వినే విషయంలో ఒకప్పుడున్న పరిస్థితులు వేరు .. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. నిర్మాతకి .. దర్శకుడికి .. హీరోకి పూర్తి కథను చెప్పాలి. సాధారణంగా చాలా సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటూ వుంటారు.

ఒక హీరోయిన్ కి కథ చెప్పేటప్పుడు, రెండవ హీరోయిన్ కి సంబంధించిన సీన్లు ఎక్కువగా చెప్పొద్దు. ఆ హీరోయిన్ కి సంబంధించిన సీన్లు మాత్రమే చెబుతూ వెళ్లండి. 'ముందడుగు' సినిమా విషయానికే వస్తే .. శ్రీదేవి పాత్ర సినిమా మొత్తం ఉంటుంది. జయప్రద పాత్ర మాత్రం విశ్రాంతి తరువాత చాలా సేపటి వరకూ కనిపించదు.. ఆ కథ అలా పడింది. ఆ లెంగ్త్ లు వాళ్లకి చెప్పం .. లైన్ మాత్రమే చెబుతాము. మధ్యలో ఓ నాలుగు రీళ్లలో మీరు కనిపించరమ్మా అనే నిజాన్ని చెబితే ఆ స్థాయి హీరోయిన్స్ అంగీకరించరు. కనుక పాత్ర ప్రాముఖ్యతను చెప్పాలే గానీ .. నిడివి గురించి మాట్లాడకూడదు" అని చెప్పుకొచ్చారు. 
Fri, Jan 18, 2019, 05:55 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View