'మణికర్ణిక' విజయాన్ని సాధించాలి .. కులదేవత ఆశీస్సులు తీసుకున్న కంగనా
Advertisement
ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్ర ఆధారంగా 'మణికర్ణిక' చిత్రం నిర్మితమైంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను కంగనా రనౌత్ పోషించారు. క్రిష్ .. కంగనా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో కంగనా హిమాచల్ ప్రదేశ్ .. 'మండి' జిల్లాలోని తన స్వస్థలమైన 'దాబోయి'లోని తమ కుల దేవతను దర్శించుకున్నారు. మహిషాసుర మర్ధిని దేవాలయాన్ని దర్శించుకుని .. ప్రత్యేక పూజలు చేయించారు. తాను ఎంతో శ్రమించి నటించిన .. చిత్రీకరించిన 'మణికర్ణిక' ఘన విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుతూ అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. 180 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, తన కెరియర్లో చెప్పుకోదగిన సినిమా అవుతుందని ఆమె భావిస్తున్నారు. 
Fri, Jan 18, 2019, 05:15 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View