హిట్ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్
Advertisement
నటుడిగా .. దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక హీరోగా నాగశౌర్య యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఊహలు గుసగుసలాడే' ..' జ్యో అచ్యుతానంద' విజయాలను అందుకున్నాయి. ఆ తరువాత ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీ అయ్యారు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు ఫిల్మ్ నగర్లో ఒక వార్త వినిపిస్తోంది.అవసరాల .. నానితో ఒక సినిమా చేయాలనుకున్నాడు. అయితే వరుస కమిట్ మెంట్స్ తో నాని బిజీగా వున్నాడు. అందువలన నాగశౌర్య బాడీ లాంగ్వేజ్ కి తగిన కథను సిద్ధం చేసుకుని అవసరాల రంగంలోకి దిగాడట. కథ కొత్తగా అనిపించడంతో నాగశౌర్య కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత నిర్మించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. 
Fri, Jan 18, 2019, 04:24 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View