'హైవే మాఫియా' నేపథ్యంలో మహేశ్ .. విజయ్ .. యష్ హీరోలుగా ఆయా భాషల్లో సినిమా!
Advertisement
తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ మధ్య సందేశాత్మక చిత్రాలు ఎక్కువగా రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ సందేశాత్మక కథ సిద్ధమైంది. దేశంలోని ప్రధానమైన సమస్యలలో ఒకటైన పశువుల అక్రమ రవాణా చేసే మాఫియాపై రచయిత్రి సుచిత్రరావు ఒక పుస్తకం రాశారు. 'ది హైవే మాఫియా' పేరుతో క్రితం ఏడాది ఆమె ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కథను వివిధ భాషల్లో సినిమాగా నిర్మిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ దిశగా ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని నిర్మాణ సంస్థలతోను .. దర్శకులతోను సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు. హైవే మాఫియా పైకి సున్నితంగా కనిపించే బలమైన అంశమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కథలోని ప్రధాన పాత్రకు హిందీలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ .. తెలుగులో మహేశ్ బాబు .. తమిళంలో విజయ్ .. కన్నడలో యష్ సరిగ్గా సరిపోతారని ఆమె అన్నారు. ఈ కథకి తెరరూపం ఇవ్వాలనే ఆమె ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి. 
Fri, Jan 18, 2019, 03:58 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View