తిరుమల కొండపై భారీగా పెరిగిన రద్దీ!
Advertisement
తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వారాంతం రావడంతో స్వామి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య భారీగా కనిపిస్తోంది. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లూ నిండి భక్తుల క్యూలైన్ బయట రెండు కిలోమీటర్ల మేరకు పెరిగింది. ఇప్పుడు క్యూలైన్లోకి ప్రవేశించేవారికి రేపు ఉదయం తరువాత మాత్రమే స్వామి దర్శనానికి అవకాశం కల్పించగలమని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. సర్వదర్శనానికి 22 గంటల సమయం పడుతోందని, క్యూలైన్లలో ఉన్న భక్తులకు అన్నపానీయాలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. కాగా, శ్రీవారి టైంస్లాట్ దర్శనం, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.
Fri, Jan 18, 2019, 10:17 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View