‘ఇండియన్-2’ ఫస్ట్ లుక్ విడుదల.. సేనాపతి లుక్ లో కమలహాసన్ అదుర్స్!
15-01-2019 Tue 12:23
- మర్మకళను ప్రదర్శిస్తున్నట్లు పోస్టర్
- ఈ నెల 18 నుంచి షూటింగ్ ప్రారంభం
- రెహమాన్ స్థానంలో అనిరుధ్ సంగీతం

విలక్షణ నటుడు కమలహాసన్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్, దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో భారీ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో మరోసారి అదే రికార్డును రిపీట్ చేసేందుకు దర్శకుడు శంకర్ సిద్ధమయ్యారు. తాజాగా ‘ఇండియన్-2’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను శంకర్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా అభిమానులకు పొంగల్ శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి సేనాపతి పాత్రలో కమల్ మర్మకళ ను ప్రదర్శిస్తున్నట్లు ఉన్న పోస్టర్ ను శంకర్ విడుదల చేశారు. ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 18 నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు దర్శక, నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
More Latest News
దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న యూట్యూబ్ చానళ్లపై వేటు
39 minutes ago

తిరుమలలో రోజా హల్ చల్.. 50 మంది అనుచరులకు బ్రేక్ దర్శనం
45 minutes ago

వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ వీ25 ప్రో విడుదల
1 hour ago

మూడున్నరేళ్లు ఏమార్చిన జగన్ కు.. మరో ఏడాది మోసం చేయడం పెద్ద విషయమేమీ కాదు: టీడీపీ నేత జవహర్
1 hour ago

'సలార్'లో ఆయన విలనా? పోలీస్ ఆఫీసరా?
2 hours ago

మళ్లీ 10 వేలు దాటిన కరోనా కేసులు
2 hours ago
