ఎన్ఎస్ఈ చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రాజీనామా!
Advertisement
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రాజీనామా చేశారు. న్యాయపరమైన పరిణామాల నేపథ్యంలోనే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అశోక్ చావ్లా సహా ఐదుగురిని విచారించేందుకు కేంద్రం అనుమతి మంజూరు చేసిన విషయాన్ని ఢిల్లీ కోర్టుకు సీబీఐ ఈరోజు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే చావ్లా తన పదవికి రాజీనామా చేశారు.
Fri, Jan 11, 2019, 09:47 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View