మా అమ్మ అంతగా చదువుకోనప్పటికీ మంచి తెలివి తేటలున్నాయి: ప్రధాని మోదీ
Advertisement
ప్రధాని మోదీ తన చిన్నతనం నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. ఎంతో ఆసక్తి గొలుపుతున్న ఈ విషయాల గురించి ఓ సందర్భంలో మోదీ ప్రస్తావించారు. ‘హ్యుమన్స్ ఆఫ్ బాంబే’’ అనే ఫేస్ బుక్ పేజ్ నిర్వాహకులతో ఆయన తాజాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తన తల్లి హీరాబెన్ మోదీ గొప్పతనం గురించి గుర్తు చేసుకున్నారు.

అమ్మ వైద్యం కోసం బారులు తీరేవారు: 
మా అమ్మకు తన పూర్వీకుల నుంచి సంక్రమించిన వైద్య మెళకువలతో, సంప్రదాయ పద్ధతుల ద్వారా చిన్న పిల్లలకు వచ్చిన జబ్బులను నయం చేసేది. ఆమె అంత బాగా చదువుకోకపోయినప్పటికీ ఆ దేవుడు మంచి తెలివితేటలిచ్చాడు. ఆమె చేసే వైద్యం కోసం తమ పిల్లలతో ఎంతో మంది తల్లులు మా ఇంటి ముందు ఉదయానికల్లా బారులు తీరి ఉండేవారు.
Fri, Jan 11, 2019, 09:39 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View