హోదా అమలు చేయకుంటే.. నా ఊళ్లోనే కాదు.. ఏపీలోనూ శాశ్వతంగా అడుగుపెట్టను: రఘువీరా
Advertisement
రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ఏపీలో ప్రత్యేక హోదా అమలు చేసి తీరుతామని.. తద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. నేడు అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. రాహుల్ ప్రధాని అయ్యాక హోదా అమలు చేయకుంటే తన ఊరిలోనే కాకుండా.. శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్‌లోనే అడుగుపెట్టబోనని స్పష్టం చేశారు. 62 ఏళ్లుగా ఏపీలోనే జీవిస్తున్నానని.. తన ఇల్లు, ఆస్తులు అన్నీ అక్కడే ఉన్నాయని అన్నారు.
Fri, Jan 11, 2019, 08:58 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View