లక్ష్మీ పార్వతి పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను వదిలిన ఆర్జీవీ
Advertisement
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్, రెండు పాటలను చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతిగా ఎవరు నటిస్తున్నారనే విషయమై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది.

తాజాగా వర్మ ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను వదిలారు. ఇప్పటి వరకూ ఆ పాత్ర విషయమై ఎందరో నటీమణుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. కానీ ఎవ్వరి ఊహలకు అందకుండా వర్మ ఓ కన్నడ నటిని లక్ష్మీ పార్వతి పాత్ర కోసం ఎంచుకున్నారు. కన్నడ నటి యజ్ఞా శెట్టి ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతిగా కనిపించనుందని వర్మ తెలిపారు. వర్మ గతంలో తీసిన ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ సినిమాలో వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి పాత్రలో ఆమె నటించారు.
Fri, Jan 11, 2019, 08:39 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View