సినిమా చూసినట్టుగా కాకుండా ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపించింది: ‘ఎన్టీఆర్’పై కృష్ణ స్పందన
Advertisement
నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారకరామారావు జీవిత కథను బయోపిక్‌గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ బయోపిక్‌ను ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ అనే రెండు భాగాలుగా రూపొందించారు. మొదటి భాగం ‘కథానాయకుడు’ ఈనెల 9న విడుదలై మంచి సక్సెస్ టాక్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రాన్ని చూసిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

తాజాగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ తన సతీమణి విజయ నిర్మలతో కలిసి చూశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నంద‌మూరి బాల‌కృష్ణ రూపొందించిన ఎన్టీఆర్ బ‌యోపిక్ చూశాను. చాలా బాగుంది. సినిమా చూసిన‌ట్లు కాకుండా ఒక జీవితాన్ని చూసిన‌ట్టు అనిపించింది. ఎన్టీఆర్‌గారిలా బాల‌కృష్ణగారు వంద‌శాతం క‌నిపించారు. ఆయ‌న వేసిన అన్ని పాత్రల్లోనూ బాగున్నారు. తప్పనిసరిగా సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
Fri, Jan 11, 2019, 06:27 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View