వెల్ కమ్.. కార్తికేయ అల్లుడు గారు!: జగపతి బాబు ట్వీట్
Advertisement
ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం.. ప్రముఖ నటుడు జగపతి బాబు అన్న కుమార్తె పూజా ప్రసాద్‌తో అంగరంగ వైభవంగా జయపురలో జరిగిన విషయం తెలిసిందే. దీనిని మరోసారి గుర్తు చేసుకున్న జగ్గూభాయ్ తన అల్లుడు కార్తికేయకు ఆహ్వానం పలుకుతూ ట్వీట్ చేశారు.

ఈ పెళ్లి కారణంగా తమ ఫ్యామిలీ ఎంత ఆనందంగా ఉందో తెలియజేసేలా ఓ ఫోటోను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 'పూజ, కార్తికేయల వివాహ సంబరాల కారణంగా హైదరాబాద్ కొన్ని అద్భుతమైన ఫోటోలను సంపాదించింది. అల్లుడు(కార్తికేయ)గారి కుటుంబం మా జీవితాల్లోకి రావడంతో మా కుటుంబం పరిపూర్ణమైంది. వెల్‌కమ్ అల్లుడుగారు’’ అంటూ జగ్గూభాయ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Fri, Jan 11, 2019, 06:04 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View