రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న '118' మూవీ
Advertisement
కల్యాణ్ రామ్ కి ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. దాంతో ఆయన ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. తాను ఆశిస్తోన్న హిట్ '118' సినిమాతో దొరుకుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. కల్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు గుహన్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాను మార్చి 1వ తేదీన విడుదల చేయనున్నారు. కల్యాణ్ రామ్ ఆశిస్తున్నట్టుగా ఈ సినిమా అయినా ఆయనకి హిట్  తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి. 
Fri, Jan 11, 2019, 04:51 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View