న్యూఢిల్లీ-భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీ దొంగల హల్చల్.. రూ. 25 లక్షల సొత్తు అపహరణ
10-01-2019 Thu 07:37
- బీహార్‌లోని లఖీసరాయి జిల్లాలో ఘటన
- గొలుసు లాగి రైలును ఆపిన దొంగలు
- ప్రయాణికులపై దాడి

ఢిల్లీ నుంచి భాగల్పూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. ఏకంగా రూ. 25 లక్షల విలువైన సొత్తును దోచుకున్నారు. బీహార్‌లోని లఖీసరాయి జిల్లా ధన్నౌరి-కాజ్రా గ్రామాల మధ్య గొలుసు లాగి రైలును ఆపిన దొంగలు బీభత్సం సృష్టించారు. మారణాయుధాలతో ఎస్ 9, ఎస్10 బోగీల్లోకి ప్రవేశించిన దొంగలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. బంగారు నగలు, మొబైల్ ఫోన్లు, నగదును దోచుకున్నారు.
కొందరు ప్రయాణికులు ధైర్యం చేసి దొంగలను ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా వారిపై దాడిచేసి గాయపరిచారు. ఓ ప్రయాణికుడు ట్విట్టర్ ద్వారా దోపిడీ సమాచారాన్ని రైల్వే పోలీసులకు అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.
More Latest News
రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు... వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న పోలీసులు
9 hours ago

తెలంగాణలో మరో 476 మందికి కరోనా పాజిటివ్
9 hours ago

తెలంగాణలో ఒక పార్లమెంటు, 4 అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ ఇంచార్జీల నియామకం... జాబితా ఇదిగో
9 hours ago
