నాటి విపత్తు మళ్లీ రాకూడదని సముద్రుడికి నేడు ప్రత్యేక పూజలు!
26-12-2018 Wed 11:19
- ప్రపంచ చరిత్రలో అతిపెద్ద ప్రకృతి విపత్తు
- భూకంపం తరువాత విరుచుకుపడిన రాకాసి అలలు
- సునామీతో 2.27 లక్షల మంది మృతి
- నేడు సముద్రుడికి ప్రత్యేక పూజలు

సరిగ్గా 14 సంవత్సరాల క్రితం... 2004 డిసెంబరు 26వ తేదీ. మానవాళికి తెలిసిన ప్రపంచ చరిత్రలో అతిపెద్ద ప్రకృతి విపత్తు సంభవించిన రోజు. ఇండొనేషియాలోని సుమత్రా దీవుల్లో 8.9 తీవ్రతతో భూకంపం రాగా, ఇండియా సహా ఎన్నో దేశాల సముద్ర తీరాన్ని తాటి చెట్లంత ఎత్తునకు మించిన అలలు ముంచెత్తిన రోజు. అధికారిక లెక్క ప్రకారం 14 దేశాలకు చెందిన 2, 27,898 మంది ప్రాణాలు కోల్పోయిన రోజు.
ఉవ్వెత్తున ఎగసిపడిన అలలు, సమీపంలోని భవనాలను నేలమట్టం చేస్తూ, వేల కొద్దీ కిలోమీటర్ల తీర భూమిని ఆక్రమిస్తూ, కనిపించిన వారందరి ప్రాణాలను తీసిందా విపత్తు. ఇండియాలో దాదాపు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నాడు తమిళనాడుకు అతిపెద్ద నష్టం సంభవించింది. మరోసారి ఇటువంటి ప్రమాదం రాకుండా చూడాలని కోరుతూ నేడు తీర ప్రాంతంలో సముద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రజలు.
More Latest News
మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో 144 సెక్షన్
16 minutes ago

జీఎస్టీ ఇక ‘గృహ సర్వనాశన ట్యాక్స్’.. పన్ను పరిధిలోకి మరిన్ని వస్తువులు తేవడంపై రాహుల్ గాంధీ ఫైర్
12 hours ago

'హ్యాపీ బర్త్ డే' మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్!
12 hours ago
