పెండింగులో ఉన్న సినిమాపై విక్రమ్ దృష్టి!

26-12-2018 Wed 09:43
advertisement

మొదటి నుంచి కూడా వైవిధ్యభరితమైన కథా చిత్రాలకు విక్రమ్ ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. నిన్నమొన్నటివరకూ ఆయన 'కదరం కొండన్' సినిమా పనులతో బిజీగా వున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగు పూర్తయింది. ఇక విక్రమ్ 'ధృవ నచ్చత్తిరమ్' సినిమాపై పూర్తి దృష్టి పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. గౌతమ్ మీనన్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా రెండేళ్ల క్రితమే మొదలై, కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది.

ఇంకొక్క షెడ్యూల్ షూటింగ్ చేస్తే ఈ సినిమా కూడా పూర్తవుతుందట. అందువలన ఈ సినిమాను కూడా పూర్తిచేయడానికి విక్రమ్ రంగంలోకి దిగారని అంటున్నారు. చివరి షెడ్యూల్ ను జనవరి 2వ వారంలో ఆరంభించి, 14 రోజులపాటు ఏకధాటిగా షూటింగ్ జరపనున్నట్టుగా తెలుస్తోంది. హారిస్ జైరాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో, విక్రమ్ సరసన రీతూ వర్మ .. ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా కనిపించనున్నారు. 

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement