బలపడ్డ రూపాయి విలువ.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
Advertisement
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజు లాభాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో పాటు, అమెరికా డాలర్ మారకంతో రూపాయి విలువ పెరగడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు రూపాయి విలువ రూ. 1.11 మేర బలపడింది. ఒకే రోజు ఈ స్థాయిలో పెరగడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 137 పాయింట్లు పెరిగి 36,484కు చేరుకుంది. నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 10,967 వద్ద స్థిర పడింది.

టాప్ గెయినర్స్:
నవకార్ కార్పొరేషన్ (19.67%), శారద క్రాప్ కెమ్ లిమిటెడ్ (19.13%), ఎన్బీసీసీ ఇండియా (9.83%), జై కార్ప్ (9.19%), విజయబ్యాంక్ (9.16%).    

టాప్ లూజర్స్:
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (-9.63%), రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ (-5.14%), గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (-3.30%), ఐసీఐసీఐ లొంబార్డ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ (-3.12%), చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (-2.95%).  
Wed, Dec 19, 2018, 04:21 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View