తెలంగాణలో ఓల్డ్ సిటీని కేసీఆర్ గోల్డ్ సిటీగా మార్చారు.. ఆయన ప్రధాని కావాల్సిందే!: హోంమంత్రి అలీ
Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలు చెప్పిన తియ్యటి మాటలను ముస్లింలు నమ్మలేదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఓల్డ్ సిటీ(పాత బస్తీ) గోల్డ్ సిటీగా మారిందని కితాబిచ్చారు. తెలంగాణలో 95 శాతం ముస్లింలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

కేసీఆర్ లాంటి వ్యక్తి ప్రధాని అయితేనే ముస్లింలు బాగుపడతారని మహమూద్ అలీ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకులు ఓల్డ్‌ సిటీని బద్నాం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో శాంతియుత వాతావరణం ఉండేలా కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.
Wed, Dec 19, 2018, 03:58 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View