బాలకృష్ణ ఎవరో తెలియదన్న నాగబాబు వ్యాఖ్యలపై లక్ష్మీపార్వతి స్పందన
Advertisement
ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని నాగబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో నాగబాబుపై బాలయ్య అభిమానులు ఒక రేంజ్ లో మండిపడ్డారు. తాజాగా ఈ వివాదంపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు.

ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తనకు సినిమాలు పెద్దగా పట్టవని, సినిమాలు పెద్దగా చూడనని అన్నారు. బాలయ్య ఎవరో తనకు తెలియదని నాగబాబు అన్నారనే విషయాన్ని కూడా మీ ద్వారానే తెలుసుకుంటున్నానని చెప్పారు. ఈ వివాదం గురించి యాంకర్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని గతంలో బాలయ్య అన్నప్పుడు... బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని నాగబాబు అనడంలో ధర్మం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. బాలయ్య గతంలో అలా వ్యాఖ్యానించడం వల్లే... ఇప్పుడు ఈయన ఇలా రియాక్ట్ అయి ఉండవచ్చని చెప్పారు. వాళ్లిద్దరూ ఒకరికొకరు తెలియకపోవడమే మంచిదని, లోకానికి కూడా అదే మంచిదని అన్నారు. ఎందుకంటే లోకానికి వారిద్దరూ బాగా తెలుసని చెప్పారు. 
Wed, Dec 19, 2018, 03:47 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View