కేసీఆర్ తో కుమ్మక్కయిన జగన్, పవన్: ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి

05-12-2018 Wed 08:47
advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లు కుమ్మక్కయ్యారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. వీరంతా కలసి ఓ రహస్య కూటమిని నడుపుతున్నారని ఆయన అన్నారు.

అధికారంలోకి రాకముందు ఓ మాట, వచ్చిన తరువాత మరో మాట చెప్పి, ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాను బీజేపీ ఇవ్వలేదని, ఇప్పుడు కేసీఆర్ కూడా ఆ పార్టీ నీడలోనే ఉన్నారని రఘువీరా విమర్శించారు. కేసీఆర్ ను గెలిపించాలన్న లక్ష్యంతోనే జగన్, పవన్ లు పని చేస్తున్నారని ఆయన అన్నారు. బహిరంగంగా మద్దతు పలికితే, ఏపీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న కారణంతోనే ఆ పని చేసేందుకు వారు భయపడుతున్నారని ఆరోపించారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement