ఈ మధ్యనే అమ్మ నిలదీసింది.. సైలెంట్ గా ఉండిపోయా: రకుల్ ప్రీత్ సింగ్
Advertisement
ఈ మధ్యనే రకుల్ ప్రీత్ సింగ్ ను వాళ్లమ్మ పెళ్లి విషయమై నిలదీసిందట. ఈ విషయాన్ని స్వయంగా రకులే చెప్పింది. 'ఎప్పుడూ నటన, కెరీర్ అంటూ బిజీగా గడుపుతున్నావు. నీ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించుకోవా?' అని అడిగిందట. అమ్మ తన పెళ్లి గురించే అలా మాట్లాడిందని తనకు అర్థమైందని... కాసేపు మౌనంగా ఉండిపోయానని రకుల్ తెలిపింది.

తాను ఎందుకు సింగిల్ గా ఉంటున్నానో తనకే అర్థం కావడం లేదని చెప్పింది. తనకొక మంచి జీవిత భాగస్వామిని చూడమని తన స్నేహితులకు కూడా చెబుతుంటానని... కానీ, వాళ్లు పట్టించుకోవడం లేదని తెలిపింది. వయసు అయిపోతోంది, త్వరగా పెళ్లి చేసుకోమని అమ్మ చెబుతోందని అంది. తనకు కూడా ప్రేమ, పెళ్లి అంటే ఇష్టమేనని చెప్పింది. మంచి అబ్బాయిని చూడమని హైదరాబాదులో ఉన్న స్నేహితులకు కూడా చెప్పానని, వాళ్లు ఆ పని మీదే ఉన్నారని అమ్మకు చెప్పానని తెలిపింది.
Wed, Nov 21, 2018, 11:18 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View