మోహన్ లాల్ లుక్స్ అద్భుతం .. 'ఒడియన్' విడుదల తేదీ ఖరారు
Advertisement
విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకోవడంలో మోహన్ లాల్ ఎప్పుడూ ముందేవుంటారు. ఈ కారణంగానే ఆయన ఖాతాలో అనేక ప్రయోగాలు .. అవి సాధించిన విజయాలు కనిపిస్తాయి. ఆయన తాజా చిత్రంగా 'ఒడియన్' నిర్మితమైంది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగులోను డిసెంబర్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. దగ్గుబాటి రామ్ .. సంపత్ కుమార్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో మృగంగా మారే మనిషి పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. అద్భుతమైన లొకేషన్స్ ఆశ్చర్య చకితులను చేస్తాయనీ .. గ్రాఫిక్స్ మంత్రముగ్ధులను చేస్తాయని చెబుతున్నారు. పీటర్ హెయిన్స్ ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. మోహన్ లాల్ కెరియర్లో ఈ సినిమాకి ప్రత్యేకమైన స్థానం లభించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.     
Wed, Nov 21, 2018, 10:53 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View