కోహ్లీ తీరుపై మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ ఫైర్
Advertisement
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీరుపై మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ మండిపడ్డారు. మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే విషయంలో కోహ్లీ చాలా కఠినంగా వ్యవహరించాడని విమర్శించారు. అనేక విషయాల్లో కుంబ్లేను కాదని కోహ్లీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నాడని చెప్పారు. కుంబ్లే రాజీనామా చేయడానికి గల కారణాలు అందరికీ తెలిసినవే అని అన్నారు. జట్టులో ఉన్న ఒక వ్యక్తి తాను ఏది అనుకుంటే అది చేస్తాడని కోహ్లీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో కుంబ్లే మాత్రం ఏం చేస్తాడని... పదవిని వదులుకోక తప్పలేదని చెప్పారు.

టీమిండియా బలంగానే ఉందని... ఇదే టీమ్ ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల్లో పర్యటించిందని బేడీ గుర్తు చేశారు. ఆస్ట్రేలియా టీమ్ లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లు లేకపోవడం వల్ల ఆ జట్టు బలహీనంగా ఉందని భావించరాదని... ఏ ఒక్క ఆటగాడి వల్లో జట్టు బలహీనంగానో, బలంగానో ఉండదని తెలిపారు. కోహ్లీ మీద కూడా భరించలేని ఒత్తిడిని పెట్టడం మంచిది కాదని సూచించారు.
Mon, Nov 19, 2018, 08:50 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View