భారత ఆర్థిక వ్యవస్థపై నోట్ల రద్దు ప్రభావంపై ఆడిటింగ్ జరుపుతున్న కాగ్
Advertisement
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం దేశ ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిట్ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన నివేదిక పార్లమెంటు బడ్జెట్ సమావేశాల కంటే ముందే రానుంది. మరోవైపు, లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు కావడంతో... ఈ సమావేశాలు పూర్తి స్థాయిలో జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో, కాగ్ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టకపోయే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

నోట్ల రద్దుకు సంబంధించిన నివేదికను పూర్తి చేయడంలో కాగ్ కావాలనే అలసత్వం ప్రదర్శిస్తోందని గత వారం 60 మంది రిటైర్డ్ సీనియర్ అధికారులు కాగ్ కు లేఖ రాశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టకూడదనే భావనతోనే ఇలా చేస్తోందని లేఖలో అసహనం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు.
Mon, Nov 19, 2018, 08:05 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View