బీజేపీయేతర పార్టీల సమావేశాన్ని వాయిదా వేస్తున్నాం: చంద్రబాబు
Advertisement
దేశంలోని సీనియర్ నేతల్లో ఒకరైన పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో భేటీ చాలా చక్కగా కొనసాగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, కీలక వ్యవస్థలను రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతోందని... ఆర్బీఐ, ఈడీ, సీబీఐలాంటి వ్యవస్థలు ఒత్తిడికి లోనవుతున్నాయని చెప్పారు.

నోట్ల రద్దు వల్ల ఎన్నో ఇబ్బందులు కలిగాయని విమర్శించారు. రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. మైనార్టీలు భద్రతను కోల్పోయి, భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. రాజకీయ పార్టీల నేతలకు సీబీఐ నుంచి ప్రమాదం పొంచి ఉందని చెప్పారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఈనెల 22న ఢిల్లీలో నిర్వహించాలనుకున్న సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని... ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు. పార్లమెంటు సమావేశాలకు ముందే ఈ సమావేశం ఉంటుందని తెలిపారు. బీజేపీయేతర పార్టీలను ఏకంచేసే కార్యక్రమాన్ని తాము ముందుకు తీసుకెళతామని అన్నారు. 
Mon, Nov 19, 2018, 07:16 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View