నాక్కూడా అలాంటి అనుభవం ఎదురైతే బాగుండేది: ప్రీతి జింతా
Advertisement
సినీ రంగంతో పాటు పలు రంగాలను మీటూ ఉద్యమం వణికిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, బాలీవుడ్ నటి ప్రీతి జింతా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తనకు ఎప్పుడూ అలాంటి అనుభవం ఎదురుకాలేదని... ఎదురైతే బాగుండేదని, అందరికీ చక్కగా వివరించేదాన్నని తెలిపింది.

ఎదుటివారు మనల్ని ఎలా చూడాలని అనుకుంటామో... వారు మనల్ని అలాగే చూస్తారని చెప్పింది. ఇవ్వాల్టి 'స్వీటూ'... రేపు 'మీటూ' అయ్యే అవకాశం ఉందని... జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలపై చాలా మంది మండిపడుతున్నారు. లైంగిక వేధింపులకు గురైన బాధితులను చులకన చేసేలా ప్రీతి వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
Mon, Nov 19, 2018, 06:59 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View