చిరంజీవిగారికి కథ చెప్పేసి ఏడ్చేశాను: రచయిత బీవీఎస్ రవి
Advertisement
సినీ రచయితగా బీవీఎస్ రవికి మంచి పేరుంది .. అంతా ఆయనని 'మచ్చ' రవి అని పిలుస్తుంటారు. ఆయన పనిచేసిన ఎన్నో సినిమాలు విజయాలను సొంతం చేసుకున్నాయి. అలాంటి రవి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు.

"మొదటి నుంచి కూడా నేను చిరంజీవిగారి అభిమానిని. ఆయన సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఆయన సినిమాల్లోని పాటలు నాకు నోటికి వచ్చేసేవి. అంతగా చిరంజీవి గారిని అభిమానించేవాడిని. అలాంటి నేను ఏడాదిన్నర పాటు కష్టపడి చిరంజీవి గారి 150వ సినిమా కోసం ఒక కథను సిద్ధం చేశాను. చిరంజీవి గారికి 99 శాతం కథ నచ్చేసింది. ఒక్క శాతం దగ్గర కథ ఆగిపోయింది. అయినా నాకు బాధ అనిపించలేదు .. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే చిరంజీవి గారికి కథ చెప్పాలని అనుకున్నాను .. చెప్పేశాను .. నేను వచ్చిన పని అయింది సార్ .. అంటూ అక్కడే ఏడ్చేశాను"అంటూ చెప్పుకొచ్చారు.
Mon, Nov 19, 2018, 05:06 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View