వెయ్యి కోట్లు ఖర్చు అయినా సరే.. నన్ను ఓడించాలనుకుంటున్నారు: కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
Advertisement
ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ లో రూ. 1000 కోట్లు ఖర్చు చేసైనా సరే తనను ఓడించాలని కేసీఆర్ అనుకుంటున్నారని అన్నారు. మహాకూటమికి, టీఆర్ఎస్ కు మధ్య జరుగుతున్న పోరు కురుక్షేత్ర యుద్ధంలాంటిదని చెప్పారు. మహాభారతంలో వంద మంది ఉన్న కౌరవులు ఓడిపోయారని, ఐదుగురు ఉన్న పాండవులు గెలిచారని... ఆ చరిత్రనే మనం మహాభారతం ద్వారా చదువుకుంటున్నామని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లను గెలుస్తామని చెబుతున్న కేసీఆర్ కౌరవ వంశానికి చెందినవారని రేవంత్ ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలు పంచ పాండవుల వంటివని చెప్పారు. కొడంగల్ లో జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధంలో కోట్లాది రూపాయలు, వందలాది ముఠాలతో వచ్చిన కేసీఆర్ గెలుపొందుతాడా? అని ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు.
Mon, Nov 19, 2018, 04:54 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View