అశ్వారావుపేటలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ: టీపీసీసీ మహిళా విభాగం కార్యదర్శి నాగమణి
Advertisement
అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు టీపీసీసీ మహిళా విభాగం కార్యదర్శి సున్నం నాగమణి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలుగుదేశం పార్టీకి కేటాయించింది. దీనిపై నాగమణి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ములకపల్లి మండలం గుట్టగూడెంలో నియోజకవర్గం స్థాయి ముఖ్య నేతలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి బలం ఉండగా, అంతంతగా బలం ఉన్న టీడీపీకి సీటు వదుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ బలపడేందుకు ఎంతో కృషిచేశానని, నా కృషిని గుర్తించి అధిష్ఠానం తనకే టికెట్టు ఇస్తుందన్న నమ్మకం, కార్యకర్తల మనోభావాల మేరకే నామినేషన్‌ దాఖలు చేశానన్నారు. చివరికి మొండిచెయ్యి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సమావేశానికి హాజరైన ములకపల్లి, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ, దమ్మపేట మండలాల పార్టీ అధ్యక్షులు నాగమణి వెంటే నడుస్తామని ప్రకటించారు.
Sat, Nov 17, 2018, 09:58 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View