'టెంపర్' తమిళ రీమేక్ లో సన్నీలియోన్ ఐటమ్ సాంగ్
Advertisement
ఎన్టీఆర్ నటనలో కొత్త కోణాన్ని చూపించిన చిత్రాలలో ఒకటిగా 'టెంపర్' కనిపిస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో 'ఇట్టాగే రెచ్చిపోదాం' అనే ఐటమ్ సాంగ్ అప్పట్లో దుమ్మురేపేసింది. ఐటమ్ సాంగ్స్ జాబితాలో ఈ సాంగ్ ముందువరుసలో కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే పాటను తమిళ రీమేక్ కోసం చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తమిళ రీమేక్ లో హీరోగా విశాల్ చేస్తున్నాడు. 'అయోగ్య' పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం సన్నీలియోన్ ను ఎంపిక చేసుకున్నారు. ఇందుకోసం ఆమెకి భారీ పారితోషికమే ముట్టినట్టుగా చెబుతున్నారు. తెలుగురిలో మాదిరిగానే తమిళంలోను ఈ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవాలని విశాల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, వెంకట్ దర్శకత్వం వహిస్తున్నాడు. 
Sat, Nov 17, 2018, 09:19 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View