నాలుగో జాబితాను విడుదల చేసిన బీజేపీ.. అభ్యర్థులు వీరే!
Advertisement
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ పడనున్న మరో ఏడుగురితో కూడిన నాలుగో జాబితాను బీజేపీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ కార్యదర్శి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఏడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పోటీగా గజ్వేల్‌లో బీజేపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆకుల విజయను బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో ఆమె సిరిసిల్లలో కేటీఆర్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్‌లో టికెట్ దక్కకపోవడంతో రెండు రోజుల క్రితం బీజేపీలో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభకు టికెట్ దక్కలేదు. ఇక బీజేపీ విడుదల చేసిన జాబితాలో.. ఎ.శ్రీనివాసులు (చెన్నూరు), జంగం గోపి (జహీరాబాద్), ఆకుల విజయ (గజ్వేల్), శ్రీధర్ రెడ్డి (జూబ్లీహిల్స్), భవర్‌లాల్ వర్మ (సనత్ నగర్), సోమయ్య గౌడ్ (పాలకుర్తి), ఎడ్ల అశోక్ రెడ్డి  (నర్సంపేట) ఉన్నారు.
Sat, Nov 17, 2018, 06:26 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View