టీజేఎస్‌లో మిర్యాలగూడ సీటు విషయమై లొల్లి
Advertisement
ఇప్పటి వరకూ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను గడగడలాడిస్తున్న సీట్ల లొల్లి ఇప్పుడు తెలంగాణ జనసమితిలో కూడా ప్రారంభమైంది. మిర్యాలగూడ టికెట్ విషయమై రచ్చ ప్రారంభమైంది. ఈ స్థానంపై టీజేఎస్ నేత విద్యాధర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ జానారెడ్డి బంధువు విజయేందర్‌రెడ్డికి టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది.

 దీంతో విద్యాధర్ రెడ్డి వర్గం ఫైర్ అయింది. విద్యాధర్‌రెడ్డికి కాకుండా మరొకరికి టికెట్ ఇస్తే పార్టీ బండారం బయటపెడతామని హెచ్చరిస్తోంది. టికెట్ ఇచ్చే విషయమై కాంగ్రెస్ హైకమాండ్ వద్ద చర్చ జరిగాక మరో వ్యక్తి పేరును తెరపైకి తేవడమేంటని విద్యాధర్‌రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసమితిలో టికెట్ ఎవరికివ్వాలో చెప్పడానికి జానారెడ్డి ఎవరని ప్రశ్నించారు.
Fri, Nov 16, 2018, 09:45 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View