టీటీడీ పాలకమండలి సభ్యుడి పదవికి సండ్ర రాజీనామా ఆమోదం
Advertisement
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుడిగా ఉన్న తెలంగాణ టీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్య ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన రాజీనామాను ఆమోదిస్తూ గురువారం టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో టీటీడీకి కొత్త పాలక మండలిని నియమించారు. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటాలో సండ్ర వెంకట వీరయ్యకు పాలక మండలి సభ్యుడిగా అవకాశం కల్పించారు. అయితే, గత నెలలో తెలంగాణ అసెంబ్లీ రద్దు కావడంతో సండ్ర మాజీ ఎమ్మెల్యేగా మారిపోయారు. దీంతో ఆయన తన పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Fri, Nov 16, 2018, 07:01 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View