రాహుల్ నివాసం వద్ద ధర్నా చేస్తున్న మాజీ మేయర్ కార్తీకరెడ్డి అరెస్ట్!
Advertisement
మహాకూటమి పొత్తులో భాగంగా తమకు సీటు దక్కుతుందని భావించిన ఆశావహులకు నిరాశే ఎదురైంది. దీంతో సీట్ల గొడవ ఢిల్లీకి చేరింది. సీటు దక్కకపోవడంతో మనస్తాపం చెందిన హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివాసం వద్ద నిరసనకు దిగారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు టికెట్‌ కేటాయించకపోవడంపై అసంతృప్తికి గురైన ఆమె, భర్తతో కలిసి ధర్నాకు దిగారు. కార్తీక రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ అధిష్ఠానం ప్రయత్నించినప్పటికీ ఆమె పట్టు వీడలేదు. దీంతో అక్కడే ఉన్న పోలీసులకు ఆమెను అరెస్ట్ చేయక తప్పలేదు. కార్తీక రెడ్డితోపాటు ఆమె భర్తనూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Thu, Nov 15, 2018, 08:49 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View