ఆందోళన పడవలసిన అవసరం లేదు .. అభిమానులకు శింబు భరోసా!
Advertisement
తెలుగులో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వచ్చిన 'అత్తారింటికి దారేది' .. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించింది. పవన్ కల్యాణ్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. దాంతో ఈ సినిమాను తమిళంలో శింబు హీరోగా రీమేక్ చేస్తున్నారు. 'వంత రాజవతాన్ వరువేన్' పేరుతో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

అయితే శింబు ఇంతకు ముందు చేసిన 'అ అ అ' సినిమా కొన్ని గొడవల కారణంగా ఆగిపోయింది. తమ విషయం తేలేవరకూ శింబు తాజా చిత్రాన్ని విడుదల కానివ్వమని వాళ్లు హెచ్చరిస్తున్నారు. దాంతో ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా .. లేదా? అనేది ప్రశ్నగా మిగిలింది. అందుకు శింబు స్పందిస్తూ .. 'చట్టపరమైన సమస్యలు తాను చూసుకుంటాననీ .. అభిమానులు ఆందోళన చెందవలసిన పనిలేదని .. ఈ సినిమా తప్పకుండా సంక్రాంతికి వస్తుంది' అని భరోసా ఇచ్చాడు.   
Thu, Nov 15, 2018, 11:18 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View