టికెట్ కూడా తెచ్చుకోలేనివాడివి.. సీఎం అవుతావా? ఏం బతుకు నీది?: పొన్నాలపై ప్రత్యర్థి ముత్తిరెడ్డి ఫైర్
Advertisement
కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యపై జనగామ టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కూడా తెచ్చుకోలేని వాడివి తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతావా? ఏం బతుకు నీది? అంటూ విరుచుకుపడ్డారు. పొన్నాలను కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం గుర్తించడం లేదని అన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తికి పార్టీ టికెట్ కూడా రాకపోవడం... ఆయన పనితీరుకు నిదర్శనమని చెప్పారు. దేశంలోనే నెంబర్ వన్ సీఎం కేసీఆర్ అని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే టీఆర్ఎస్ ను గెలిపిస్తాయని అన్నారు. కేసీఆర్ మరోసారి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బచ్చన్నపేట మండలంలో ప్రచారం నిర్వహిస్తూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
Thu, Nov 15, 2018, 10:52 AM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View