నువ్వు లేవనే బాధ మనసును తొలిచేస్తున్నా.. నవ్వుతూనే ఉంటా!: విమాన ప్రమాదంలో మరణించిన ప్రియుడి కోసం పోస్ట్
Advertisement
ఇటీవల ఇండోనేసియా రాజధాని జకార్తాలో లయన్‌ ఎయిర్‌ సంస్థకు చెందిన ఓ విమానం బయలుదేరిన కొద్ది సేపటికే సముద్రంలో కూలిపోయిన ఘటన విదితమే. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా 188 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పెళ్లి కోసం వేరే ప్రాంతానికి బయలుదేరిన వరుడు కూడా ఉన్నాడు. జకార్తాకు చెందిన నంద ప్రతామా తనకు ఇష్టమైన అమ్మాయిని మరికొన్ని గంటల్లో పెళ్లి చేసుకోబోతున్నానని ఎన్నో కలలు కంటూ విమానం ఎక్కాడు.

దీనికి ముందు తనకు కాబోయే భార్య ఇంతన్ స్యారీకి ఫోన్ చేసి తాను అనుకున్న సమయానికి రాలేకపోతే.. ఫోటోలు దిగి తనకు పంపించాలని కోరాడు. ఇంతలోనే విమాన ప్రమాదంలో నంద కన్నుమూశాడు. అయితే అతని కోరిక నెరవేర్చాలనుకున్న ఇంతన్ పెళ్లి కూతురిలా తయారై ఫోటోలు దిగింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో అప్‌లోడ్ చేసింది. ‘నువ్వులేవనే బాధ మనసును తొలిచేస్తున్నా.. నీకోసం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. నువ్వు చెప్పినట్లుగానే దృఢంగా ఉంటాను’ అంటూ హృదయం బరువెక్కే పోస్టు పెట్టింది.
Wed, Nov 14, 2018, 08:54 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View