135 ఏళ్ల చరిత్ర కల్గిన ‘కాంగ్రెస్’ చంద్రబాబు ముందు మోకరిల్లింది: ఎంపీ కవిత విమర్శ
Advertisement
కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ ఎంపీ కవిత నిప్పులు చెరిగారు. జగిత్యాలలో ఆమె మాట్లాడుతూ, అభ్యర్థుల ఖరారు కోసం మహాకూటమి నేతలు అమరావతి చుట్టూ తిరిగారని, ఒకవేళ ఆ కూటమి అధికారంలోకొస్తే పాలన అమరావతి నుంచి సాగుతుందని విమర్శించారు.

135 ఏళ్ల చరిత్ర కల్గిన ‘కాంగ్రెస్’ చంద్రబాబు ముందు మోకరిల్లిందని ఎద్దేవా చేశారు. తెలంగాణపై చేస్తున్న చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. కాగా, పలువురు న్యాయవాదులు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగిత్యాలలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కవిత సమక్షంలో వారు టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు.
Wed, Nov 14, 2018, 08:04 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View