భవిష్యత్తులో నెగెటివ్ రోల్స్ చేస్తాను: రవితేజ
Advertisement
రవితేజ తాజా చిత్రంగా 'అమర్ అక్బర్ ఆంటోని' ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమాను గురించి ఆయన మాట్లాడుతూ .."ఈ సినిమాలో నేను పోషించిన అమర్ అక్బర్ ఆంటోని పాత్రలు మూడు కూడా వేటికవే వైవిధ్యభరితమైనవి. ఈ మూడు పాత్రల్లోను కొత్తగా కనిపిస్తాను.

ఈ మూడింటిలో నాకు 'అమర్' పాత్ర మరింతగా నచ్చింది. ఈ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా నెగెటివ్ రోల్స్ కూడా ట్రై చేయవచ్చుగదా అనే ప్రశ్న ఎదురవుతోంది. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేయడానికి నాకు ఇంకా సమయం ఉందని అనుకుంటున్నాను. భవిష్యత్తులో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను తప్పకుండా చేస్తాను. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఆ పాత్రల్లోను కొత్తదనం ఉండేలా చూసుకుంటాను" అని చెప్పుకొచ్చాడు.      
Wed, Nov 14, 2018, 02:01 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View