‘వినయ విధేయ రామ’ టీజర్ తెచ్చిన తంటా!
Advertisement
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీ స్థాయికి తీసుకెళ్లింది. అయితే అదే టీజర్ ఒక ఇబ్బందిని కూడా తెచ్చిపెట్టింది. దీనికి కారణం ప్రముఖ నటుడు ప్రశాంత్.

ఆయన ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించారు. జీన్స్‌ చిత్రంలో ఐశ్వర్యారాయ్‌తో కలిసి ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి హీరో.. ‘వినయ విధేయ రామ’ టీజర్‌లో రామ్ చరణ్ ముందు నడుస్తుండగా వెనుక వస్తున్న నలుగురిలో ఒకరు కావడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రశాంత్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Tue, Nov 13, 2018, 09:06 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View