నాకు సీటు కేటాయించలేదనడం అవాస్తవం.. నేనే పోటీ చేయట్లేదు: స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి
Advertisement
టీ-కాంగ్రెస్ పార్టీ నిన్న రాత్రి విడుదల చేసిన తొలి జాబితాలో ఆ పార్టీకి చెందిన మహిళా నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి పేరు లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, తనకు సీటు కేటాయించలేదనడం అవాస్తవమని, పోటీ చేయాలని పార్టీ తనను కోరిందని చెప్పారు.

అయితే, స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల ప్రచార బాధ్యతలు తనపై ఉన్నందువల్లనే తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఇందులో పార్టీ తప్పు ఏమాత్రం లేదని ఆమె వివరించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా ఈరోజు వెలువడుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తొలి జాబితాలో తమ పేర్లు లేని నాయకులు ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 
Tue, Nov 13, 2018, 07:35 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View