వైసీపీ ‘అన్న కోసం’ వెబ్ సైట్ ఆవిష్కరణ
Advertisement
వైసీపీ విస్తృత ప్రచారం నిమిత్తం ‘అన్న కోసం’ వెబ్ సైట్ ప్రారంభమైంది. విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైసీపీ అధినేత జగన్ ఈ వెబ్ సైట్ ను ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కోసం పని చేస్తామని ముందుకొచ్చే వారి సంఖ్య అధికంగా ఉందని, రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది ముందుకొస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ వెబ్ సైట్ ను రూపొందించడం జరిగిందని, వైసీపీ అభిమానులు తమ పేర్లను ‘అన్న కోసం’ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
Tue, Nov 13, 2018, 07:19 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View